logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈద్గా వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ప్రశాంతంగా ముగిసిన రంజాన్ ప్రార్థనలు

పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి :-



ఈద్గా మైదానం వద్ద బందోబస్తు ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఈద్గా వద్ద భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసు శాఖ ముందస్తుగా సమగ్ర భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ స్వయంగా ఈద్గా వద్దకు చేరుకొని బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రార్థనలు ప్రశాంతంగా ముగియడం తో సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. భక్తుల రాకపోకలు పూర్తిగా ముగిసే వరకు మధ్యాహ్నం వరకు బందోబస్తు కొనసాగుతుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

1
55 views

Comment