నవ నారసింహ క్షేత్రంలో బాలమేధావి.స్వామివారి సేవలో నైనా జైస్వాల్.
AIMA న్యూస్.నంద్యాల జిల్లా. పరమ పవిత్రమైన దిగువ అహోబిల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాలమేధావి నైనా జైస్వాల్ శుక్రవారం రోజున సందర్శించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.నైనా జైస్వాల్ తొలుత ప్రహ్లాద వరదుడైన లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ పరిసరాల్లోని ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు.దర్శనం అనంతరం నైనా జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన నవ నారసింహ క్షేత్రమైన అహోబిలాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నాను. క్రీడల్లో రాణించాలన్నా, జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా ఏకాగ్రతతో పాటు దైవబలం కూడా అవసరమని స్వామివారిని దర్శించుకోవడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత వెలకట్టలేనిదని ఆమె పేర్కొన్నారు అత్యంత చిన్న వయసులోనే పీహెచ్‌డీ పట్టా పుచ్చుకుని, అంతర్జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్‌లో భారత్ కీర్తిని చాటుతున్న నైనా జైస్వాల్‌ను చూడటానికి స్థానికులు, భక్తులు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పలువురు ఉత్సాహం ప్రదర్శించారు.