నెల్లూరు సిటీలో ఘనంగా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ జన్మదిన వేడుకలు – జనసేన ఆధ్వర్యంలో అన్నదానం
నెల్లూరు, మార్చి 20:
నెల్లూరు నగరంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, ఎఎంసి డైరెక్టర్ విజయలక్ష్మి గునుకుల దంపతుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించబడింది. పెద్ద సంఖ్యలో జనసైనికులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమానికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ— నాయకత్వం అంటే విమర్శలు కాదు, సమాజానికి సేవ చేయడం, ప్రజలకు మార్గదర్శనం చేయడమేనని తెలిపారు. వేములపాటి అజయ్ గారు అలాంటి ఆదర్శ నాయకుడిగా నిలుస్తున్నారని కొనియాడారు.
అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా అజయ్ గారు పేదల సంక్షేమం కోసం కృషి చేస్తూ, పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లోనూ, జిల్లా స్థాయి కార్యకలాపాల్లోనూ ఆయన నాయకత్వం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఏపీ టిడ్కో చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పేదలకు గృహాల కల్పన కోసం కృషి చేస్తున్న అజయ్ గారు, రాబోయే శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున గృహాల పంపిణీకి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
చిన్నా పెద్ద అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా అజయ్ గారు నిలుస్తున్నారని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
✊ జై జనసేన