లోన లొటారం, పైన పటారం — ప్రజలను మోసం చేసే బడ్జెట్ ఇది!
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర బీసీలను పూర్తిగా మోసం చేసింది.
ఉద్యోగులు తమ కష్టపడి జమ చేసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం, వారి నిరంకుశ వైఖరికి నిదర్శనం.
రైతు భరోసా నిధులకు సరైన కేటాయింపులు లేకుండా ఈ బడ్జెట్‌ను ఎలా ప్రవేశపెట్టారు?
రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం.
రైతుల కోసం ఎంత నిధులు కేటాయించారో స్పష్టత లేదు — ఇది రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తుంది.
మొత్తానికి, ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్‌గా నిలిచింది.
– బీజేఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు