మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
జర్నలిస్ట్: ఆకుల గణేష్
శుక్రవారం నర్సంపేట మార్కెట్ యార్డ్ లో తెలంగాణ మార్క్ ఫెడ్, నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కేట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, డిఎఓ అనురాధ, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతుల నుండి మొక్కజొన్నను కొనుగోలు చేయడానికి ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది