logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రతి ఒక్క పోలీసు నిజాయితీతో వ్యవహరించాలి. ప్రతి ఒక్క పోలీసు కు సమానమైన విధులను కేటాయించాలి. ఆయుధాలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలి.

పత్రిక ప్రకటన
అదిలాబాద్ జిల్లా,
మార్చ్ 20 :-


సాయుధ పోలీసు కు క్రమశిక్షణ కీలకం

ప్రతి ఒక్క రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు సక్రమంగా జరగాలి

పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని ఆకస్మిక పరిశీలన.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

సాయుధ పోలీసు సిబ్బందికి క్రమశిక్షణతో పాటు, నిజాయితీ తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. శుక్రవారం స్థానిక పోలీసు సాయుధ ముఖ్య కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ విధులలో నిర్లక్ష్యాన్ని వహించకూడదని తెలిపారు. సిబ్బంది కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలి అని, విధులలో సమయపాలన పాటిస్తూ ఉండాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, విధులకు అనవసరంగా గైర్హాజరైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు సాయుధ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆయుధాన్ని పూర్తిగా శుభ్రపరుస్తూ ఉండాలని తెలిపారు. యువ పోలీసులకు సాంకేతికపరమైన విధులను కేటాయించడం జరుగుతుందని, ఉత్సాహం ఉన్నవారికి సంబంధిత విభాగాలలో విధులను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు సాయుధ పోలీసులు సంసిద్ధంగా ఉంటూ ఎల్లవేళలా అప్రమత్తమై ఉండాలని సూచించారు. సిబ్బంది వారికి ఉన్నటువంటి సెలవు దినాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిబ్బంది విధులను రొటేషన్ పద్ధతిలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బందికి ప్రతి ఒక్కరికి విడతలవారీగా సమానమైన విధులు కేటాయించి, ఎలాంటి భేద భావాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టీ మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0
77 views

Comment