కాంగ్రెస్ నాయకుల సమక్షంలో డీసీసీ నూతన నియామకులకు ఘన సన్మానం
ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ నూతన బాధ్యులుగా ఎంపికైన బ్రీజులాల్ (ఉపాధ్యక్షుడు), భానోత్ ప్రణీత భాయ్ (ప్రధాన కార్యదర్శి), ఎత్మారాం (కార్యదర్శి)లను యూత్ కాంగ్రెస్ ఆసిఫాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు షేక్ నసీర్ తరఫున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేవరావ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ దాదే అలీ, ఉప సర్పంచ్ మహమ్మద్ ఖురేషి, రాథోడ్ దత్తరాం, దుర్గే కాంతారావ్, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు మహమ్మద్, చౌహాన్ గోవింద్, దళిత రత్న కోర్రల మహేందర్, AMC డైరెక్టర్ జాదవ్ కైలాస్, షేక్ హుస్సేన్, అహ్మద్, జాక్రుల్ల ఖాన్, నిజాం, నసీర్, ముక్రం, గుంజు చిన్నయ్య, దేవరావు కిరణ్ రాజు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.