నేడు గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి అసెంబ్లీ వరకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు
తేదీ:-20.03.2026
హైదరాబాద్
, మాజీ మంత్రి హరీష్ రావు గారు మరియు ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు, మిగతా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ఏడాదికి ₹12,000 చొప్పున, రెండు సంవత్సరాలకు కలిపి రావాల్సిన ₹24,000 ఆర్థిక సాయాన్ని తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనితో పాటు రైతులకు ఇస్తామన్న రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్ తన హామీలను నెరవేర్చే వరకు BRS పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.