జిల్లాలో గ్యాస్ సిలిండర్ ల కొరత లేదు..ప్రజలు గ్యాస్ కొరత పుకార్లను నమ్మవద్దు:జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
పత్రికా ప్రకటన
మార్చి 19, 2026-ఆదిలాబాద్:-
జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలోపల సిలిండర్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీ లతో సమావేశం నిర్వహించి, ప్రజలకు సరిపడినన్ని సిలిండర్లను సాఫీగా పంపిణీ చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు గ్యాస్ కొరత అని వస్తున్న అసత్య వార్తలను, పుకార్లను నమ్మవద్దని, సమస్యలు, సందేహాల నివృత్తి కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1939 ను సంప్రదించాలని
కలెక్టర్ విజ్ఞప్తి చేసారు.