పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారం అందుకున్న భద్రాచలం బాబు
న్యూస్ కంటెంట్:
శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సంబరాల సందర్భంగా 19-03-2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో ఘనంగా ఉగాది పురస్కార వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశ శుక్ల గారు, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా సింహపూరి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చి. వెంకటేశ్వర్లు (భద్రాచలం బాబు) గారికి మెమెంటో, దుశాల్వా, నగదు పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బొమిళ్ళ బాలచెన్నయ్య, పల్లం వెంకయ్య, గోపీనాథ్, చి. సుందర్ రావు, అరవ ప్రభాకర్, డి.ఎస్.డబ్ల్యూ. ప్రసాద్ రావు (రిటైర్డ్ ఎస్.ఐ.) తదితరులు పాల్గొని భద్రాచలం బాబు గారిని ఘనంగా సత్కరించారు.