ఇదేం బాదుడు?
నిజాంబాద్ ప్రతినిధి
( పాములసంతోష్ కుమార్)
తేదీ:18-03-2026
*ఉగాది స్పెషల్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికులపై అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడం జరిగింది.
ఒకటిన్నర చార్జీ అని,డబుల్ చార్జీ అని ఎక్స్ప్రెస్ లో సైతం విధించడం ప్రయాణికులు విస్తు పోయారు. ప్రైవేట్ బస్సులు గాని, ప్రైవేట్ వాహనాలు గాని విధించాల్సిన అధిక చార్జీలు రాష్ట్ర ఆర్టీసీ విధించడం ఇది మొదటిసారి అని ప్రయాణికులు విస్తు పోయారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీగా జీరో టికెట్, మగవాళ్ళపై ఒకటిన్నర టికెట్ అని, డబుల్ చార్జీ అని, వివిధ రకాలుగా వసూలు చేయడం ప్రైవేట్ వాహనయాజమాన్యాలు ఇష్టమైన రీతిలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం జరిగిందని పరోక్షంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచనలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందని ప్రయాణికులు వాపోయారు. ఎడమ చేతితో ఇచ్చినట్టుగానే ఇచ్చి, కుడి చేతితో లాక్కోవడం జరిగిందని, ప్రయాణికులు ప్రభుత్వంపై విమర్శించారు. ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ లన్ని కూడా తగ్గించడం జరిగిందని, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను పెంచడం జరిగిందని, మహాలక్ష్మి పథకం ఇచ్చి కూడ ప్రయోజనం లేదని ప్రయాణికులు వాపోయారు.
ప్రయాణికులరద్దీ దృష్టిలో ఉంచుకొని ఎక్స్ప్రెస్ బస్సులను పెంచాల్సిన అవసరం ఉందని లేదంటే మహాలక్ష్మి పథకం ఇచ్చి కూడా ప్రయోజనం లేదని ఎంజీబీఎస్ నుండి భైంసా కు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుTG18Z0040 నంబరు గల బస్సులో వెళ్లే ప్రయాణికులు వాపోయారు.