మాజీ సీఎం ని కలిసిన అరకు ఎమ్మెల్యే రేగం
అరకు నియోజకవర్గంలో పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలను మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యె రేగం మత్స్యలింగం వివరించారు. గురువారం అరకు ఎమ్మెల్యే ఉండవల్లి లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి గురించి తెలియజేశారు. ఈ మేరకు మాజీ సీఎం కు అరకు ఎమ్మెల్యే ఉగాధి శుభాకాంక్షలు తెలిపారు.