శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో అలుమ్ని మెంటార్‌షిప్: క్రాఫ్టింగ్ యువర్ కెరీర్ పాత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం
పాణ్యం (AIMA MEDIA): విద్యార్థులు తమ చదువు పూర్తి చేసిన తర్వాత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి మరియు సెమీకండక్టర్ రంగంలో ఉన్న అవకాశాల గురించి నిపుణులు వివరించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా డిజైన్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, ప్రస్తుత విద్యార్థులకు మెంటార్‌లుగా ఉండి సహకరిస్తామని హామీ ఇచ్చారు.కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇటువంటి అలుమ్ని ప్రోగ్రామ్స్ ఎంతో దోహదపడతాయని తెలిపారు. ECE హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ డాక్టర్ వై. మల్లికార్జున రావు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ బి. ఆలేఖ్య హిమబిందు పర్యవేక్షించగా, ECE విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా (Resource Persons) కళాశాల పూర్వ విద్యార్థులు మిస్టర్ బి. మాధవ రావు (ఫిజికల్ డిజైన్ ఇంజనీర్, ఇంటెల్ కార్పొరేషన్, బెంగళూరు), మిస్టర్ ఎన్. సురేష్ (వెరిఫికేషన్ ఇంజనీర్, మేవిన్ సిస్టమ్స్, బెంగళూరు) మరియు మిస్టర్ ఎన్. ఆదిత్య రెడ్డి (జూనియర్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్, మేవిన్ సిస్టమ్స్, బెంగళూరు) హాజరయ్యారు.