“అమ్మోరికి పొంగళ్ళు… తమ్ముడి ఆరోగ్యం కోసం అక్క మొక్కు తీర్చుకున్న హృద్య ఘట్టం”
నెల్లూరు నగరంలోని సంతపేట 49, 50 డివిజన్ పరిధిలో రాగిచెట్టు సెంటర్ వద్ద కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన నాయకులు కిషోర్ గునుకుల గారు త్వరగా కోలుకోవాలని ఆయన సోదరి రజని గారు మొక్కు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అమ్మవారికి పొంగళ్ళు సమర్పిస్తూ మొక్కు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా కిషోర్ గునుకుల గారు భావోద్వేగంగా మాట్లాడుతూ…
“నా తమ్ముడికి వచ్చిన కష్టం తొలగిపోవాలని కనకదుర్గమ్మను మొక్కాను. చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో తోడుగా ఉన్న మా అక్క ప్రేమ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. నా చిన్ననాటి నుంచి ఏ చిన్న కష్టం వచ్చినా నాకంటే ఎక్కువగా బాధపడే నా సోదరి దీవెనలు ఉన్నంతవరకు నాకేం డోకాలేదు” అని తెలిపారు.
అలాగే, పూజలో పాల్గొంటూ తన పుట్టి పెరిగిన ప్రాంతంలోని అక్కచెల్లెళ్లకు, ఆడపడుచులందరికీ కనకదుర్గమ్మ కటాక్షం కలగాలని ఆకాంక్షించారు. సంతపేట ప్రాంత మహిళల ప్రేమాభిమానాలు తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయని, వారి ఆశీస్సులతో మరింత ప్రజాసేవకు అంకితం అవుతానని పేర్కొన్నారు.
ఈ పూజా కార్యక్రమంలో సంతపేట ప్రాంతానికి చెందిన ఆడపడుచులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కిషోర్ గునుకుల గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, సోదరి రజని గారు, శివకృష్ణ, హర్ష, జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, ప్రియాంక, ఆమని, భవాని తదితరులు పాల్గొన్నారు.