logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

వికలాంగుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… మంత్రి పొంగూరు నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు!

నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం 54వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వికలాంగుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో వికలాంగుల ఐక్య సంఘం అధ్యక్షులు ఎస్కే సనావుల్లా మాట్లాడుతూ… వికలాంగులకు అండగా నిలిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. గతంలో 500 రూపాయల పింఛన్‌ను 1500కు, ఆపై 3000కు పెంచిన ప్రభుత్వం, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చి పింఛన్‌ను 6000కు పెంచిందని పేర్కొన్నారు.
అదేవిధంగా వికలాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణం వంటి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ఇంద్రధనస్సు వరాలను కురిపిస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి పొంగూరు నారాయణలకు వికలాంగులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, కోఆప్షన్ సభ్యులు జమీర్ అహ్మద్, క్లస్టర్ ఇంచార్జ్ జహీర్ తదితరులు పాల్గొన్నారు.

4
279 views

Comment