logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నాగేశ్వరరావు , నాగార్జున తండ్రికొడుకులుగచేసిన సినిమా "ఇద్దరూ ఇద్దరే ".

𝐒𝐒 క్రియేషన్స్-అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తనిర్మాణంలో వెంకట్ అక్కినేని ,యార్లగడ్డ సురేంద్ర𝟏𝟗𝟖𝟗 " శివ " తర్వాత 𝟏𝟗𝟗𝟎లో నాగేశ్వరరావు , నాగార్జున తండ్రికొడుకులుగచేసిన సినిమా "ఇద్దరూ ఇద్దరే ". ఇదేపేరుతో తెలుగులోకృష్ణంరాజు శోభన్ బాబులతో𝟏𝟗𝟕𝟔 -రాజేంద్రబాబు,సాయికిరణ్ హీరోగ 𝟐𝟎𝟎𝟕, మోహన్ లాల్, అమల పాల్ 𝟐𝟎𝟏𝟓 నాటిమలయాళ రీమేక్ ,𝟏𝟗𝟗𝟎లో దీంతోకలిపి ఇదేపేరుతో నాలుగుసినిమాలు తెలుగులో వచ్చాయి.
𝐀కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇద్దరు అక్కినేనిల క్రేజీ కాంబినేషన్ లో 𝟏𝟗𝟗𝟎సెప్టెంబర్𝟓 విడుదలైంది. భమిడిపాటి రాధాకృష్ణ కథకు గణేష్ పాత్రో మాటలు రాశారు. ఇందులో కష్టమొచ్చినప్పుడల్లా అయ్యప్ప మాలవేసి-ఇబ్బందికలిగితే మాల తీసేసే క్యారెక్టర్ లో గొల్లపూడి మాటలు గమ్మత్తు గా ఉంటాయి. తమిళనాడులో అయ్యప్పమాలవేసే కొంతమంది కష్టజీవులు , రాత్రికి మాల తీసివేసి మద్యము పుచ్చుకునే మాదిరి ఇందులో కూడా వేయడము,తీయడము జరుగుద్ది.
కథలో బలమున్నప్పటికీ , సాగతీత స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ ముందు 𝐀𝐍𝐑 ,నాగేశ్వరరావుమధ్యవచ్చే అనవసర సీన్స్ , మద్యంసేవించి"లివర్ పాడయిపోద్ది" అనేసీన్లు నాగార్జునకు పెద్దగా సెట్ కాలేదు . బార్ లో గొల్లపూడి, నాగార్జున లతో సాగే ఓ సీన్ 1985నాటి కృష్ణ "అందరి కంటే మొనగాడు" సినిమాలో లివర్ పాడయిపోతుందని ఇదే తరహాలో ఉంది.
వేటూరి , సిరివెన్నెల పాటలకు రాజ్ కోటి సంగీతమందించగ
బాలసుబ్రమణ్యం -మనో -చిత్ర శైలజలు పాటలు పాడారు.
ఓనమాలు నేర్పాలని... అనుకున్నా కన్నా ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిల్చింది....
పిట్టా.....లొట్టి పిట్టా
పైసలున్న.. పాపాలిట్ట అనే తెలంగాణ యాస పాట
అబ్బాయిలు చెప్పనా.ఓరి దేవుడో పాటలు కూడా బాగుంటాయి.........
" పిట్టా...లొట్టి పిట్టా "పాట మ్యూజిక్ , సెట్టింగ్స్, డ్రెస్సింగ్స్ 𝟏𝟗𝟗𝟏లో అమితాబ్ బచ్చన్ " 𝐇𝐔𝐌" చిత్రంలో సేమ్ టూ సేమ్ దించేసారు.
కథ విషయానికొస్తే....కోర్టులో జడ్జిగా 𝐀𝐍𝐑, ఓపేటకు అన్ని అన్ని విధాల సహాయముచేసే వ్యక్తిగా నాగార్జున ఉంటారు.
వీరిరువురికి ఏదో ఓసందర్భంలో సంభాషణలు జరుగుతూనే ఉంటాయి. 𝐀𝐍𝐑 మేనకోడలు రమ్యకృష్ణ , నాగార్జునలకు చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన పరిచయం ప్రేమ వరకు పోతుంది.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా గా , మద్యం మాఫియా లీడర్ గ కోటశ్రీనివాసరావు ఉంటాడు.ఓదివ్యాంగయువతిని అమ్మబోయే సమయంలో , తన ప్రేయసి రమ్యకృష్ణను కోట అనుచరులు అత్యాచారం చేయబోయే సమయంలో అడ్డు పడి ఉంటాడు. కోటాను ఎదిరించిన విషయం తెలుసుకున్న అతని మాజీ లిక్కర్ భాగస్వామి రంగనాథ్ & కోట భాదిత భాగస్వాములు నాగార్జున సహాయం కోరగా , కోటా యాంటీ గ్రూపులో చేరిన నాగార్జున అతని కల్తీ లిక్కర్ సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టి , రిక్షా నడిపే స్థాయి నుండి కారు ఓనర్ స్థాయికి వెళ్తాడు.
నాగార్జునను ఎలాగైనా దెబ్బ కొట్టాలని కోట శ్రీనివాసరావు తన అనుచరులతో రోడ్డు ఫుట్ పాత్ పై నిద్రించేవారిపై కారు నడిపించి , ఆనేరం నాగార్జున పై మోపగా ఉరిశిక్ష ఖరారు అవుతుంది. ఈలోపే కోటా శ్రీనివాసరావు మాజీ భాగస్వామి రంగనాథ్ ద్వారా గతంలోతనకొడుకును ఎత్తుకుపోయానని అతనే నాగార్జున అని తెలుస్తుంది .కొడుకుపై మమకారంతో కొన్ని నాటకీయ పరిణామాలతో నాగార్జునను పారిపోయేట్లు చేసి అతనిలో మార్పు వచ్చేందుకు 𝐀𝐍𝐑 ప్రయత్నిస్తారు....
తండ్రికొడుకులని గొల్లపూడిద్వారా నాగార్జునకు తెలుస్తుంది.
తర్వాత కోటా గ్యాంగ్ పై రివెంజ్ తీర్చుకుని ,నిర్దోషిగా ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.....
పైతారాగణముతోపాటు..నాగార్జున కన్నతల్లిగా𝐊𝐑విజయ
పెంచిన తల్లిగా రమప్రభ , రమ్యకృష్ణ తండ్రిగా గొల్లపూడి, కోట శ్రీనివాసరావు భాగస్వాములుగా బాబు మోహన్ ,
మల్లికార్జున రావు , జయప్రకాశ్ రెడ్డి... శివ లో నటించిన చాలామంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు... తమిళంలో విలన్ గా అలరించే(ముద్దులమావయ్య గజా )ఆనంద్ రాజ్, మలయాళనటుడు మోహన్ రాజ్ (లారీడ్రైవర్ గుడివాడ రౌడీ ) కేవలం కొద్దిసేపు మాత్రమే కోటా అరాచాక రౌడీలుగా కనబడతారు . భారీ అంచనాలతో విడుదలై ఆశించినంత విజయం సాధించని ఈసినిమా యూట్యూబ్ లో ఉంది. అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చే ఈ సినిమాను ఇంతకుముందు చూడని వారు కాలక్షేపానికి ఓసారి చూడవచ్చు

0
0 views

Comment