logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క

లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్... చనిపోయిన ఉద్యోగి జీతం బకాయిలు 4 లక్షల రూపాయలు బిల్లు కోసం మంజుల అనే ఈ ఉద్యోగి 50 వేల రూపాయలు లంచం అడిగింది. కడుపు మండిన కొడుకు ఈ విషయం కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ లోకాయుక్తకు చెప్పాడు. మైసూరు దగ్గర పుల్లూరులో మంజుల 50 వేల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టేశారు. వెంటనే ఆమె సినిమా స్టయిల్లో ఆఫీసులో ఉన్న కత్తి తీసుకుని చేతిమీద పొడుచుకుని కేకలు పెట్టింది. తనను చంపేస్తున్నారంటూ అరుపులతో బీభత్సం చేసింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు అవేవీ పట్టించుకోకుండా ఆమెను హాస్పిటల్ కి తరలించి లంచం కేసు దానికి అదనంగా కత్తితో గాయం చేసుకుని తమని బెదిరించే ప్రయత్నం చేసిన కేసు, మారణాయుధాన్ని తనతో ఉంచుకున్న కేసు పెట్టి జైలుకు పంపారు..

0
24 views

Comment