logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఈరోజు తెలంగాణ రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు ఆదే శాలతో

గార్ల మండల బిజెపి అధ్యక్షులు నక్కా శివకృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గార్ల మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతు భరోసా అందిస్తామని, మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని , కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని, వృద్ధులు వితంతువులు వికలాంగుల పింఛన్లను పెంచుతామని అదేవిధంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఇలా 6 గ్యారెంటీలు 420 హామీలతో గద్దనెక్కింది.రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాలల్లోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైంది కావున వెంటనే ప్రభుత్వము స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అజ్మీర రాము, వెంగలి బుచ్చిబాబు, జక్క సత్యనారాయణ. బొందిల నాగరాజు, అజ్మీర సుమలత, ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది

6
890 views

Comment