కైలాస్ సురేష్ బాబు… ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే ప్రాముఖ్యతపై సందేశం
కైలాస్ సురేష్ బాబు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డే సందర్భంగా దేశ రక్షణలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల ప్రాముఖ్యతపై మాట్లాడారు.
ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ డేను నిర్వహిస్తున్నారు. భారత రక్షణ రంగానికి బలం చేకూర్చిన ఈ ఫ్యాక్టరీల సేవలను గుర్తు చేసుకునే రోజుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ సందర్భంగా కైలాస్ సురేష్ బాబు మాట్లాడుతూ…
“దేశ భద్రతకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వెన్నెముకలాంటివి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు, సామగ్రిని స్వదేశంలో తయారు చేయడం ద్వారా దేశం మరింత బలపడుతోంది” అని తెలిపారు.
1801లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీలు నేటికీ సైనిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశ రక్షణ కోసం పనిచేస్తున్న ఈ సంస్థల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కైలాస్ సురేష్ బాబు పిలుపునిచ్చారు.