పడుగుపాడులో రంజాన్ తోఫాల పంపిణీ… 150 నిరుపేద కుటుంబాలకు సహాయం
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కోవూరు మండలం పడుగుపాడులో సేవా కార్యక్రమం నిర్వహించబడింది.
మస్జిద్-ఎ-రెహమానియా మరియు మదరసా కమిటీ ఆధ్వర్యంలో, నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. దాతల సహకారంతో సుమారు 150 నిరుపేద కుటుంబాలకు ఈ తోఫాలు అందించారు.
రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. నిరుపేదలు కూడా కడుపునిండా ఆహారం పొందుతూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు