నెల్లూరు టౌన్ హాల్‌లో హరివిల్లు క్రియేషన్ ఉగాది పురస్కారాలు ఘనంగా
▪️ కార్యక్రమంలో పాల్గొన్న చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
నెల్లూరు టౌన్ హాల్‌లో హరివిల్లు క్రియేషన్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమరావతి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ…
హరివిల్లు క్రియేషన్ వ్యవస్థాపకులు దోర్నాల హరిబాబు కళారంగానికి విశేష సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
ప్రతి సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి పురస్కారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు అందజేశారు.
నాటక, సినీ, టీవీ రంగాల్లో హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరిబాబు… ‘నెల్లూరు కామెడీ’ పేరిట స్లాంగ్ రీల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని, అలాగే కొత్త కళాకారులను తయారు చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారందరికీ అభినందనలు తెలిపారు.
అలాగే కళాకారులను ప్రోత్సహిస్తూ హరివిల్లు క్రియేషన్ కార్యక్రమాలకు సహకరిస్తున్న అమరావతి కృష్ణారెడ్డి మరియు ఇతర దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.