అనకాపల్లి జిల్లా గ్రామీణ విద్యార్థులకు ఢిల్లీ ఫిజిక్స్ వాలా సహకారంతో మండల స్థాయి ఐఐటీ నీట్ కోచింగ్ ప్రారంభం
అనకాపల్లి జిల్లా. ఢిల్లీ ప్రముఖ ఫిజిక్స్ వాలా, సమర్పణ సేవా, వేద విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు తక్కువ ధరలో నాణ్యమైన కోచింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు.సమర్పణ సంస్థ స్థాపకుడు కిల్లాడ సత్యనారాయణ , వేద విద్యా సంస్థ నిర్వాహకుడు పోతల ప్రసాద్ నాయుడు సమక్షంలోనే ఈ బృహత్తర కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని, సుమారు 50 మంది ఐఏఏస్, ఐపీఏస్ అధికారులు, ప్రముఖుల పర్యవేక్షణలో కోచింగ్ ఏర్పాట్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.ఐఐటీ జెఈ మెయిన్ అధునాటిక్, నీట్ అండర్ గ్రాడ్యుయేట్, 8, 9, 10 తరగతుల ఫౌండేషన్ కోర్సులు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణిత శాస్త్రం, జీవ శాస్త్రం సబ్జెక్టుల్లో అందించబడతాయి.అనుభవజ్ఞుల అధ్యాపకులు, సంక్లిష్ట ఆధారిత బోధన, ప్రతి 15 రోజులకు పరీక్షలు విశ్లేషణ, సందేహ నివృత్తి సమావేశాలు, పోటీ పరీక్షల మార్గదర్శనం, ఆన్ లైన్ గ్రంథాలయం, అధ్యాపకుల గమనికలు, కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యక్తిగత ప్రగతి విశ్లేషణ వంటి ప్రత్యేకతలతో ఈ కోచింగ్ జరుగుతుంది.నగరాలకు వెళ్లి లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గరే ప్రశాంతంగా ఇంటి భోజనంతో ఏకాగ్రత చదువు, బలమైన సంక్లిష్ట పునాది, ఆత్మవిశ్వాసం, సరైన పరీక్షా వ్యూహం, వ్యక్తిగత అధ్యయన ప్రణాళికలు వంటి ప్రయోజనాలు విద్యార్థులకు లభిస్తాయి.పరిమిత సంఖ్యలో విద్యార్థులతో నాణ్య బోధన జరుగుతుంది. అలాగే జాతీయస్థాయిలో సివిల్స్ లో 22వ స్థానం సాధించిన కిల్లాడి సత్యనారాయణ శిష్యురాలు గీతిక అరోరా ఈయొక్క సంస్థలో తన వంతు భాగంగా 100 మందిని దత్తత తీసుకోవడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మాకవరపాలెం వెంకటరమణ నిర్వహణలో ఎంట్రన్స్ పరీక్ష కొండల అగ్రహారం జీవన్ రాయ్ విద్యా సంస్థలో 29 మార్చి 2026 ఉదయం 9 గంటలకు 7,8,9 తరగతులకు వేర్వేరుగా గణితం, భౌతిక రసాయన శాస్త్రాలు, జీవ శాస్త్రం 100 మార్కుల పరీక్షలు.ఈ పరీక్షల్లో మొదటి 50 మంది మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచిత కోచింగ్ అందుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో తరగతులు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు