నరేష్ - నిరోషా జోడిగా వీరిమధ్యలో బుజ్జిగాడుగా తరుణ్
నరేష్ - నిరోషా జోడిగా వీరిమధ్యలో బుజ్జిగాడుగా తరుణ్ నటించిన 𝟭𝟵𝟵𝟬 ఆగస్టు 𝟯𝟬నాటి 𝗖𝗥𝗜𝗠𝗘 & 𝗖𝗢𝗠𝗘𝗗𝗬 𝗘𝗡𝗧𝗘𝗥𝗧𝗔𝗜𝗡𝗘𝗥 " బుజ్జిగాడి బాబాయ్ ". 𝗣. బలరామ్ నిర్మాతగా ఓంకార్ రచనలో నరేష్ హీరోగా ఇదే బ్యానర్ పై 𝟭𝟵𝟵𝟬లో వీరికాంబినేషన్లో మూడు సినిమాలురాగా , పోలీస్ భార్య హిట్ అయి జస్టిస్ రుద్రమదేవి-ఈబుజ్జిగాడిబాబాయ్ నిరాశ పరిచాయి. మూడు సినిమాలోనూ నరేష్ కు ప్రధాన పాత్రలేదనే చెప్పవచ్చు .జస్ట్ హీరో అంతే....పోలీస్ భార్యలో సీత , జస్టిస్ రుద్రమదేవిలో జయప్రద షీరోలు గా మెయిన్ క్యారెక్టర్ లో కనబడతారు . ఇకఇందులో సినిమా మొత్తం ఓంకార్ మధ్యనే నడుస్తుంది . ఓంకార్ రచనలో ఆయన క్యారెక్టర్ సినిమాకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది. కొందరైతే అప్పట్లో ఆయన ఆ సినిమాలో ఉన్నారంటే డైలాగ్ డెలివరీ టైమింగ్ , ఓరకమైన వ్యంగపు మాటలకోసమే సినిమాకు వెళ్లేవారు. సినీ , బుల్లితెర ప్రేక్షకులతో పాటు... స్వాతి వార పత్రిక పాఠకులకు అభిమానుపాత్రుడైన రచయిత పరిటాల ఓంకార్ 𝟮𝟬𝟬𝟳జనవరి𝟳న గుండెపోటుతో మరణించారు.
లేదంటే మరిన్ని సామాజికఅంశాలతో కూడిన వినోదాత్మక సినిమాలు వచ్చి ఉండేవేమో....
అనుభవం ఎంత ఉన్నా...ఆవగింజంత అదృష్టం ఉండాలనే సామెతలా దర్శక నిర్వహణలో సహాయకుడిగా పనిచేసిన కుర్రా రంగారావు కు జస్టిస్ రుద్రమదేవి, బుజ్జిగాడి బాబాయ్ సినిమాలకు దర్శకుడిగా అవకాశం వచ్చినప్పటికీ ఆయన దర్శకుడిగా నిలదొక్కుకోలేకపోయారు . ఆపై 𝗦𝗩 కృష్ణారెడ్డి సినిమాలకు సహదర్శకుడిగా చాలా సినిమాలు చేశారు.
కథ , స్క్రీన్ ప్లే , మాటలు , పాటలు ఓంకార్ అందించగా... రాజ్ కోటి సంగీతమందించారు.
ఓంకార్ దొంగ సాక్ష్యాలు చెప్పే పాత్రలో పురోహితుడుగా ,
పాస్టర్ గా రకరకాలు వేషాలతో కనపడటం సినిమాకు ప్లస్ పాయింట్ . సాధారణంగా అన్ని సినిమాల్లో హీరోయిన్ లేదా హీరో చెల్లెళ్లపై రేప్ సీన్లు ఉంటాయి , ఇందులో వయసు పైబడిన హీరోయిన్ తల్లిపై నర్రా వెంకటేశ్వరరావు తో రేప్ సీన్ పెట్టడం కాస్త వెరైటీగానే అనిపిస్తుంది...
టూకీగా కథలోకి వస్తే....తన అన్న కొడుకు తరుణ్ తో కలసి అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నరేష్ నానాకష్టాలు పడుతూఉంటాడు .చివరకు ఎలాగోలా నిరోషా వెంటపడి ప్రేమిస్తాడు . కోర్టులో దొంగ సాక్ష్యాలు చెపుతూ జల్సాగా ఓంకార్ బ్రతికేస్తుంటాడు. నర్రా వెంకటేశ్వరరావు ఫ్యాక్టరీలో జరిగిన ఓ హత్య విషయంలో దొంగ సాక్ష్యము చెప్పి , అతనికి డబ్బు అవసరమైనప్పుడల్లా నర్రా ను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతూ ఉంటాడు. ఓంకార్ ఆట కట్టించటం కోసము , 𝗖𝗜 సహాయముతో తప్పుడు కేసు పెట్టించి జైలుకు పంపిస్తాడు .
నర్రా వెంకటేశ్వరరావు తన అన్న భార్య అయిన సుమిత్ర , ఆమె కూతురు నిరోషాల ఆస్తికోసము వేధిస్తూ , ఆస్తికోసం తల్లి లాంటి వదినపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె అతన్ని చంపేస్తుంది. అదే సమయంలో జైలు నుండి ఓంకార్ తప్పించుకుని పారిపోతాడు. నర్రా శవాన్ని తల్లి కూతుళ్లు
పూడ్చేటపుడు చూసిన ఓంకార్ వాళ్లను బెదిరించి అదే ఇంట్లో , బొంబాయిలో ఉన్న నిరోషా మేనమామగా తిష్ట వేస్తాడు .నిరోషాను ప్రేమించిన నరేష్ 𝗦𝗜గా ఉద్యోగం పొంది
ఓంకార్ ను పట్టుకునే డ్యూటీని వేస్తారు. ఓంకార్ కు తరుణ్ కు ఓ చిన్నపాటి 20 రూపాయల ఇడ్లీ కథ నడిచి ఉంటుంది.
ఆ ఇడ్లీ కథ ద్వారా బాబాయి నరేష్ కు, అనుమానం వచ్చి తరుణ్ చెప్పగా , ఇన్వెస్టిగేషన్లో భాగముగా నరేష్ నిరోషను పెళ్లి చేసుకుని ఓంకార్, హత్యచేసిన సుమిత్రను చట్టానికి పట్టిస్తాడు. చివర క్లైమాక్స్ లో సుమిత్ర ఏ తన తప్పిపోయిన అక్క అని , నిరోష తన మేనకోడలని తెలియగా సినిమాకు శుభం కార్డు పడుతుంది......
పై తారాగణముతో పాటు.... నరేష్ అన్నగా ఈశ్వర రావు , వదినగా రస్మి , బామ్మగా నిర్మలమ్మ , సుమిత్ర లాయర్ గా రావికొండల రావు , ప్రత్యేకపాటలో డిస్కో శాంతి , టీచర్ గా పొట్టి ప్రసాదు , కానిస్టేబుల్స్ గా ధమ్ - మిఠాయి చిట్టి.... తదితరులు నటించిన సినిమా యూట్యూబ్ లో ఉంది....
కాలక్షేపానికి , ముఖ్యముగా ఓంకార్ నటన కోసము ఓసారి చూడవచ్చు ......