logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మొదటితరం సినీ స్టార్స్-ఎవరు..??

మొదటితరం సినీ స్టార్స్-ఎవరు..??
వారి వైభోగం గురించి ఎంతమందికి తెలుసు.??
***************************************
తెలుగు చిత్రసీమలో స్వాతంత్య్రం రాకమునుపే
టాప్ హీరోలు సూపర్ స్టార్ హోదా పొందిన
నటుల గురించి మనం తెలుసుకుంటున్నాం.
ముఖ్యంగా NTR మొదటి సినిమా "మనదేశం"
(1949) కంటే ముందే "స్టార్ హోదా" ఉన్న
వ్యక్తుల స్టార్ స్టేటస్ గురించి మనం తెలుసుకుంటున్నాం.
వారు అప్పట్లో ఎలాంటి స్థితిని స్థాయిని
అనుభవించారో ప్రేక్షకుల మదిలో ఎలా నిలిచిపోయారో నేడు
చాలామందికి తెలియజేయాలని నా చిరు ప్రయత్నం.
.
వందేళ్ళ సినిమా పండుగ జరుపుకుంటున్న
నేటి నేపధ్యంలో 1940 ప్రాంతంలోనే హీరోయిజాన్ని
అపాదించుకొని స్వతంత్రం రాకముందే
తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ హీరోగా
ఒక వెలుగు వెలిగిన ఒకే ఒక వ్యక్తి CH నారాయణరావు
(చదలవాడ నారాయణ రావు
సెప్టెంబరు 13, 1913 - ఫిబ్రవరి 14, 1984)
.
అయన గురించి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.
అటువంటి గ్లామర్ హీరో 1942 ప్రాంతంలో
మహాత్మా గాంధీ ఇచ్చిన 'క్విట్ ఇండియా'
ఉద్యమ పిలుపుకు ఆకర్షితుడై సినిమాలను కూడ
వదులుకుని స్వాతంత్రోద్యమంలో పాల్గొని
జైలుశిక్ష అనుభవించిన విషయం అతి
కొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం.
ఆ రోజులలో నారాయణరావు తన విలాసవంతమైన
సినిమా జీవితాన్ని వదులుకుని స్వాతంత్ర
సమరంలో పాల్గొనడం అప్పట్లో హాట్ న్యూస్.
.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని
సామాన్య జైలు ఖైదీలా జైలు శిక్ష అనుభవించిన
ఒకనాటి గ్లామర్ హీరో సి.హెచ్. నారాయణరావు
గురించి చాలామందికి తెలియదు.
అటువంటి నారాయణరావు ఇచ్చిన
స్పూర్తితో ఆయన అభిమానులు అనేకమంది
స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారు అంటే
నారాయణరావు పిలుపుకు ఆరోజులలో
ఎంత విలువ ఇచ్చేవారో అర్ధం అవుతుంది.
స్వాతంత్ర్యం రాక ముందు 1940 ప్రాంతంలోనే
హీరోయిజాన్ని అపాదించుకున్న టాలీవుడ్
ప్రప్రధమ గ్లామర్ హీరో సి.హెచ్. నారాయణరావు
అన్న విషయం ఆనాటి వారికి
తప్ప నేటి తరానికి తెలియని విషయం.
.
స్వతంత్రం రాకముందే తెలుగు ప్రేక్షకులకు
గ్లామర్ హీరోగా ఒక వెలుగు వెలిగిన సి.హెచ్.నారాయణరావు
ఆరోజులలోనే హీరో అంటే ఎర్రగా, పొడుగుగా,
నాజుకుగా, మ్యాన్లీగా నారాయణరావులా ఉండాలి అన్న
ట్రెండ్ ను క్రియేట్ చేసిన టాప్ హీరో.
ఆనాడే తాను నటించే సినిమాలకు 'లక్ష' రూపాయల
పారితోషికం తీసుకున్న ఆనాటి టాప్ హీరోగా రికార్డు సృష్టించాడు.
.
చదలవాడ నారాయణ రావు
1940 నుంచి 1950 దాకా ఓ దశాబ్ద కాలం పాటు
తెలుగు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన సినిమా నటుడు.
చిత్తూరు నాగయ్య, వేమూరి గగ్గయ్య,
కన్నాంబ, ఋష్యేంద్రమణి,
సురభి బాలసరస్వతి వంటి
కళాకారులు నాటకరంగం నుండి వచ్చినవారే.
అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం,
సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి
స్వయంకృషితో నటుడుగా పేరు
తెచ్చుకొన్న వ్యక్తి సి.హెచ్‌.నారాయణరావు.
.
అసలు సినిమాల్లోకి వస్తానని కానీ,
రావాలని కానీ ఆయన అనుకోలేదు.
ఆయన సినీ రంగప్రవేశం చాలా తమాషాగా జరిగింది.
ఓ రోజు రైలు ప్రయాణం చేస్తున్న సినీ దర్శకుడు
ద్రోణంరాజు చిన కామేశ్వరరావు,
నారాయణరావును చూశారు.
అందం, మాటతీరు చూసి ముగ్ధుడైన కామేశ్వరరావు
ఆయనను ఏకంగా హీరో పాత్రకు ఎంపిక చేశారు.
అనుభవం లేదంటున్నా సినీ నటుణ్ణి చేశారు.
అలా మీర్జాపురం రాజావారు జయా ఫిలిమ్స్‌
పతాకంపై తీస్తున్న 'జీవనజ్యోతి' (1940)లో
హీరోయిన్‌ కృష్ణవేణి సరసన కథానాయకుడిగా
సిహెచ్‌. నారాయణరావు సినీ రంగ ప్రవేశం జరిగింది.
తొలి సినిమాతోనే మంచి నటుడిగా పేరు వచ్చింది.
.
1940 లో వచ్చిన సాంఘికం ‘జీవనజ్యోతి’లో
మాంచి పర్శనాలిటి గల హీరో ప్రవేశించాడు.
నునుపైన, సహజమైన జుట్టు. సోగకళ్ళు,
పొడుగైన ముక్కు, నవ్వితే నవరత్నాలు
రాలినట్టు కనిపించే పెదవులు,
పలువరసతో అందర్నీ ఆకర్షించాడు.
నాగయ్య, సి.ఎస్‌.ఆర్‌., జి.వి.రావు,
ఉమామహేశ్వరరావులు ముఖ్య పాత్రలు ధరిస్తున్న
ఆ రోజుల్లో పర్సనాల్టీలో వీరికి భిన్నంగా
కనిపిస్తూ నారాయణరావు రాగానే,
‘హీరో అంటే ఇలా అందంగా ఉండాలన్నమాట..
హీరోయిన్‌ లాగానే’అనుకున్నారు ప్రేక్షకులు.
.
నారాయణరావు నటన చాలా సహజంగా
ఉంటుందని అవలీలగ నటించేస్తాడనీ పత్రికలు రాసేవి.
అయితే ఆయన కేవలం హీరో పాత్రలే ధరించలేదు.
హీరోగా ఎష్టాబ్లిష్‌ అయిన తర్వాత
విలన్‌ పాత్రలు కూడా ధరించారు.
తర్వాత కారెక్టర్‌ యాక్టర్‌. ‘చెంచులక్ష్మి’,
‘తాసిల్దార్‌ ’, ‘మొదటిరాత్రి ’,
‘ మనదేశం’, ‘ తిరుగుబాటు’,
మొదలైన చిత్రాల్లో హీరో అయితే,
‘ జీవితం’లో విలన్‌. ‘దేవత’,
‘స్వర్గసీమ’ చిత్రాల్లో విలన్‌ కాదుగాని,
అదో తరహా పాత్రలు. ‘ గంగ గౌరీ సంవాదం’లో
శివుడు, సాంఘికాలు, పౌరాణికాలు, జానపదాలు...
ఇలా అన్నింటిలో కూడా నారాయణరావు నటించారు.
నారాయణరావు గారు నటించినది
(దాదాపుగా 22 చిత్రాలు)తక్కువ చిత్రాలే
అయినా చలనచిత్ర చరిత్రలో
తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొన్నారు.
.
1940 ప్రాంతంలో తెలుగు సినిమా రంగంలో
టాప్ హీరోగా వెలుగొందుతున్న చిత్తూరు నాగయ్యను
నారాయణరావు తన గ్లామర్ తో నాగయ్య
ఇమేజ్ ను దాటిపోయి ఆరోజుల్లోనే
గ్లామర్ హీరోగా ముద్ర వేయించుకున్నారు.
నారాయణరావులా డ్రెస్ లు వేసుకోవాలి,
ఆయనలా క్రాప్ చేయించుకోవాలి అని
ఫాలో అయ్యే యువతరం ఆయనకు
ఆరోజుల్లోనే వీరాభిమానులుగా
ఉన్నారంటే అంటే ఎవరు నమ్మరు.
సి. హెచ్.(చదలవాడ)నారాయణరావుగారు
చిత్రసీమలో అడుగుపెట్టాక నాగయ్యగారు
హీరో పాత్రలకు స్వస్తిపలకాల్సి వచ్చిందని ఆనాడు చెప్పారు.
.
అంతేకాదు ఆరోజుల్లో ఆయన నటించిన
‘మొదటి రాత్రి’అనే సినిమాలో ఆయన
లారీ క్లీనర్ గా వేషం వేసి, అడ్డగళ్ళ చారల
బనియన్ వేసుకుంటే ఆరోజుల్లోనే
ఆ బనియన్ లకు ఇప్పటి క్రేజీ స్టార్స్
పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల
టీ-షర్ట్స్ కు వచ్చినంత క్రేజ్ వచ్చిందట.
.
వాహినీవారు భక్తి రసాత్మకమైన చిత్రం
‘భక్తపోతన’(1944)ను విడుదల చేసారు.
అందులో ఆయన శ్రీరాముడిగా నటిస్తే
ఆయన పోస్టర్లకు ఆరోజుల్లోనే ప్రేక్షకులు దండం పెట్టేవారట.
అందులో రెండు మూడు సార్లు శ్రీరాముడు ప్రత్యక్షమవుతాడు.
ఆ శ్రీరాముడ్ని చూసి ప్రేక్షకులు తన్మయులైనారు.
అంతకుముందు అంత అందమైన,
ఆకర్షణీయమైన శ్రీరామచంద్రుడ్ణి చూడలేదు.
‘సాక్షాత్తు రాముడే’అన్నారు ప్రేక్షకులు.
.
ఆయన స్టైల్స్ ఇప్పటి టాప్ హీరోలు కూడా
ఫాలో అవుతున్నారు అంటే ఎవరూ నమ్మరు.
కాని ఇది నిజం.‘జీవితం’ అనే సినిమాలో
నారాయణరావు అగ్గిపుల్లతో సిగరెట్ వెలిగించే
మ్యానరిజం అప్పట్లో యూత్ ను విపరీతంగా ఆకర్షించింది.
ఆ మ్యానరిజమే సూపర్ స్టార్ రజినీకాంత్
అనుసరించాడు అంటే ఎవరూ నమ్మరు.
.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి
తారకరామారావు నటించిన తొలి సినిమా
"మనదేశంలో నారాయణరావుగారే హీరో.
మొట్టమొదటిసారి నటిస్తున్న మన NTRకి
ఎన్నో విషయాలను నారాయణరావు చెప్పారని అంటారు.
.
కొన్నాళ్ళ కింద 90వ పుట్టినరోజు జరుపుకున్న
అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘శ్రీ లక్ష్మమ్మ కధ’
అలాగే నారాయణరావు హీరోగా నటించిన
‘లక్షమ్మ’ సినిమాలు ఒకే రోజు విడుదల
అయితే ఆ రోజులలో సూపర్ హిట్ కొట్టిన
ఘనత నారాయణరావుకే దక్కింది.
1940 ప్రాంతం నుండి మన దేశానికి
స్వతంత్రం వచ్చిన 1947 ప్రాంతం వరకూ
తెలుగు సినిమాను ఏలిన సూపర్ హీరో నారాయణరావు.
1951 లో ఆంద్ర యూనివర్సిటీ నుండి
గౌరవ డాక్టరేట్ పొందిన నారాయరావు
మన తెలుగు సినిమా రంగంలో కళాప్రపూర్ణ
బిరుదు పొందిన మొదటి తెలుగు సినిమా నటుడు.

0
77 views

Comment