logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కాలువలో పడిన వృద్ధురాలు సురక్షితం… స్థానికుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది

నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొడుగుపాడు గ్రామం నుంచి జమ్మిపాలెం వెళ్లే రోడ్డులో ఉన్న బ్రిడ్జి కింద ఒక వృద్ధురాలు కాలువలో పడిపోయిన ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో వృద్ధురాలిని కాలువ నుంచి పైకి తీసి కాపాడారు.
ప్రస్తుతం వృద్ధురాలి ఆరోగ్యం బాగానే ఉందని సమాచారం. పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.
అయితే ఆమె ఎవరు, ఎలా కాలువలో పడింది అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

21
2303 views

Comment