రైతన్న -మీకోసం వారోత్సవాలు: మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి.
గోస్పాడు (AIMA MEDIA): గోస్పాడు మండలంలోని అన్ని గ్రామాల్లో రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి తెలిపారు.మార్చి 16 ,17, 18,23,24,25 వ తేదీల్లో రైతు సేవ కేంద్రం సిబ్బంది , పశుసంవర్ధక శాఖ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,గ్రామ రెవెన్యూ అధికారులు టీములుగా ఏర్పడి రోజుకు 90 కుటుంబాలను సర్వే చేసి పూర్తి చేస్తారు అని పేర్కొన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ,ప్రభుత్వము నుంచి పూర్తి మద్దతు తదితర అంశాలను రైతులకు వివరించారు.మార్చి 16వతేది సోమవారం గోస్పాడు గ్రామంలో సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ శేఖర్, మండల వ్యవసాయ అధికారి స్వప్నిక రెడ్డి,వెటర్నరీ డాక్టర్ ఉమాదేవి, గోస్పాడు అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ ,రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు ముఖ్యమంత్రి సూచించిన పంచ సూత్రాలు తెలియజేసి మరియు ప్రతి రైతు ఫార్మర్ యాప్ ఏపీ ఎయిమ్స్ 2.0 డౌన్లోడ్ చేసు కోవాలని , వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాలను తెలియజేశారు.