logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
15:03:2026.

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలో సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా మరియు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 165 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

అలాగే పరీక్షా పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తీసుకెళ్లే సమయంలో కూడా పోలీసు బందోబస్తు కల్పించనున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనవసరంగా వ్యక్తులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో సంబంధిత పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు మరియు పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా లేదా వారికి సహకరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు పోలీసు శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

0
0 views

Comment