కొవ్వూరులో నూకాంబిక అమ్మవారి జాతర: బత్తుల తాతయ్య బాబు దర్శనం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ పవిత్ర ఉత్సవంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,అనకాపల్లి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.అమ్మవారి దర్శనం చేసుకొని హోమం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తాతయ్య బాబు, భక్తులతో మాట్లాడుతూ అమ్మవారి పండుకొక్కు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. "ఈ గ్రామ ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికీ ఇళ్లు అందించి గ్రామీణుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాము" అని తెలిపారు.అనంతరం జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గ్రామ కూటమి నాయకులు బంటు రాజు, గ్రామ పంచాయతీ నాయకులు, మండల నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్థులు అందరూ హాజరయ్యారు. మహా ప్రసాద వితరణలో తాతయ్య బాబు స్వయంగా పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ జాతరలో ట్మ నృత్యాలు, భజనలు, కళారంగ కార్యక్రమాలు జరిగి గ్రామం మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది. స్థానికులు ఈ మహోత్సవం గ్రామ ఐక్యతను మరింత పెంచిందని, రాజకీయ నాయకుల దర్శనం ఆనందాన్ని రేకెత్తించిందని పేర్కొన్నారు.