ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న జర్నలిస్ట్ ఎం. హాసన్ బేగ్
నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు మరియు జర్నలిస్ట్ ఎం. హాసన్ బేగ్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం గత కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. ఉస్మాన్ బేగ్ కుమారుడైన హాసన్ బేగ్ సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.
1996 నుండి 2004 వరకు బలహీన వర్గాల సమాఖ్య, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, యానాది సంఘాల సమాఖ్య, దళిత మహాసభ వంటి పలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి బడుగు, బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేశారు. ఆ తరువాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) మరియు మహాజన సంఘర్షణ సమితి (MSS) వంటి ఉద్యమ సంస్థల్లో కూడా సేవలందించారు.
సామాజిక సేవను మరింత విస్తరించేందుకు 2026 జూన్‌లో “అల్ హ్యూమన్ సర్వీస్ ఆర్గనైజేషన్” అనే స్వంత సంస్థను స్థాపించి, పేదలు మరియు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
జర్నలిజం రంగంలో కూడా హాసన్ బేగ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2018 నుండి 2021 వరకు స్నేహ టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా ఏపీ ఫైబర్ నెట్‌లో 48వ నెంబర్‌లో ప్రసారమవుతున్న శ్రేయాస్ టీవీలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు.
అంతేకాకుండా జర్నలిస్టుల హక్కుల కోసం కూడా పోరాటం చేస్తూ, 2019 నుండి 2023 వరకు తిరుపతికి చెందిన ఆశాజ్యోతి సాయంకాలం దినపత్రిక వ్యవస్థాపకులు ఢిల్లీ బాబు రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (APMF) అనే ప్రత్యేక జర్నలిస్టుల సంఘంలో నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాల పాటు అప్రతిహతంగా సేవలందించారు.
సామాజిక సేవ మరియు జర్నలిజం రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎం. హాసన్ బేగ్, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల మధ్య విశ్వాసాన్ని సంపాదిస్తున్నారు.