జీతాల కోసం ముఖ్యమంత్రికి లేఖలు
శ్రీకాకుళం: నాలుగు నెలలుగా జీతాలు, పెన్షన్లు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలియజేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ పెన్షనర్లు ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్ర అధికారులకు లేఖలు, ఈమెయిల్స్ పంపుతున్నారు.తక్షణం అదనపు గ్రాంటు విడుదల చేసి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే పెన్షన్ గ్రాంట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.