logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీసీలకు కూడా త్వరలో రక్షణ చట్టం తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం..మంత్రి సవిత

AIMA న్యూస్ :
విజయవాడ:

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు మంత్రి సవిత తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసినట్లు చెప్పారు. కులం, వృత్తి పేరుతో దూషిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బీసీ రక్షణ
చట్టం విధివిధానాల రూపకల్పనపై విజయవాడ తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రులు సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర చర్చించారు. చట్టం డ్రాఫ్టపై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు
తీసుకోవాలని నిర్ణయించారు.

అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ బీసీల మానప్రాణాలకు
భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టం తీసుకురాబోతున్నట్లు చెప్పారు. "కోర్టుల్లోనూ వీగిపోకుండా న్యాయనిపుణులతో చర్చించాం. దేశంలోనే తొలిసారిగా ఏపీలో చట్టం అమలు చేయబోతున్నాం. భేటీ వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాం. బీసీలను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్నదే మా లక్ష్యం" అని మంత్రి సవిత తెలిపారు.

0
0 views

Comment