logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

విద్యార్థులు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

విద్యార్థులు వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ జి సురేష్ కుమార్.
పుట్టపర్తి మార్చి 14: విద్యార్థులు వినియోగదారుల రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ జి సురేష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి మండల లోని జగరాజుపల్లి కస్తూరిబాయి గాంధీ పాఠశాల నందు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఉపాధ్యాయురాలు పూజారి పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ సురేష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని ఉత్పత్తుల వివరాలు పరిశీలించాలని మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగ దారులు ఏమైనా సమస్యలే ఎదురైనప్పుడు జిల్లా రాష్ట్ర మరియు జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. ఈ చట్టం ప్రకారం వినియోగదారులకు భద్రత హక్కు ,సమాచారం పొందే హక్కు, ఎంపిక హక్కు, పరిహారం పొందేందుకు హక్కు ఉందని తెలిపారు. అనంతరం భోజనం డాక్టర్ భాను కిరణ్ మాట్లాడుతూ కల్తీ ఆహారం తీసుకోవడంపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం స్వచ్ఛమైన మరియు నాణ్యమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం అన్నారు .అంతేకాక ఇటీవల కాలంలో మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు పెరుగుతున్నాయని కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల జీవిత సమస్యలు అలర్జీలో విషపూరిత ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏదైనా కల్తీ ఆహారం గురించి అనుమానం ఉన్నట్లయితే వెంటనే సంబంధిత అధికారులకు లేదా వినియోగదారుల సభ్యులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబాయి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views

Comment