కురుగుంట పీ.హెచ్.సిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత*.....
*హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడండి.. వ్యాక్సిన్ వేయించుకోండి*
*బాలికలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన.కురుగుంట పీ.హెచ్.సిలో వ్యాక్సినేషన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే సునీత.*వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత ఆదేశం*
*కస్తూరిబా పాఠశాల అదనపు భవనాలు, సిసి రోడ్డు నిర్మాణాల పరిశీలన*
*ఎమ్మెల్యేను కలసిన రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు*
హెచ్.పి.వీ వ్యాక్సిన్ పై అపోహలు వీడి 14 నుంచి 15ఏళ్ల లోపు బాలికలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కురుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రారంభించిన హెచ్.పి.వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి వ్యాక్సిన్ ఎంత మందికి వేయించారు.. పిల్లల తల్లిదండ్రులు దీనిపై ఏమంటున్నారు వంటి అంశాల గురించి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వైకల్ (గర్భాశయ)
క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను నివారించడంలో ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమైందన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం రోజున దీనిని ప్రారంభించారన్నారు. 14సంవత్సరాలు వయసు పూర్తి అయి 15సంవత్సరాల వయసు లోపల కలిగిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ వ్యాక్సిన్ గురించి మొదట చెప్పినప్పుడు చాలా మందిలో అపోహలు ఏర్పాడ్డాయన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి గుండెపోటు వస్తోందన్న ప్రచారం కూడా జరిగిందన్నారు. కానీ ఈవ్యాక్సిన్ల వలన ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఇటీవల పెరిగిపోతున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఉచితంగా అందిస్తోందన్నారు. ప్రైవేట్ గా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే సుమారు 12 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మహిళల్లో క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇటీవల బసవతారకం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించినట్టు చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. పిల్లల తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సునీత సూచించారు. అనంతరం కురుగుంట కస్తూరిబా బాలికల జూనియర్ కళాశాల అదనపు భవనాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని... ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే పాపంపేట, వివేకానంద నగర్ లో 20లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
*ఎమ్మెల్యే సునీతను కలిసిన సహకార పరపతి సంఘం సభ్యులు*
రుద్రంపేట, తాడిమర్రి వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) నూతన కమిటీ సభ్యులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. రుద్రంపేట నూతన అధ్యక్షునిగా నియమితులైన కాటిగాని కాలువ శ్రీనివాసులు, సభ్యులు ఆలమూరు బాల నరసింహులు, కక్కలపల్లి పేట వన్నూరప్ప మరియు తాడిమర్రి నూతన అధ్యక్షునిగా నియమితులైన కునుకుంట్ల శ్రీనివాస రెడ్డి, సభ్యులు పిన్నదరి రమణ, మరువపల్లి లక్ష్మీనారాయణ గార్లు స్థానిక మండల నాయకులతో కలిసి అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. తమకు పదవులు ఇచ్చినందుకు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే సునీత శుభాకాంక్షాలు తెలిపారు. రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. మెరుగైన సేవలు అందించాలని సూచించారు....