logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాబోయే రోజుల్లో పర్యాటక స్థలంగా గుత్తి కోటను అభివృద్ధి చేస్తాం*....



*అంగరంగ వైభవంగా గుత్తి కోట ఉత్సవాలు..*రాబోయే రోజుల్లో పర్యాటక స్థలంగా గుత్తి కోటను అభివృద్ధి చేస్తాం*
గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.గుత్తి కోట విశిష్టతను, సంప్రదాయాలను, వారసత్వంను భావితరాలకు.తెలియజేయాలి*అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ*గొప్ప చరిత్ర కలిగిన గుత్తి కోట గురించి అందరికీ తెలపాలి* జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్*
జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గుత్తి కోట ఉత్సవాలు - 2026 ఘనంగా మొదలయ్యాయి. శనివారం సాయంత్రం గుత్తి పట్టణంలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో గుత్తి కోట ఉత్సవాలను గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్, వీర శైవ లింగాయత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఛైర్మన్ స్వప్న, తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్మన్ వన్నూర్ బి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి.ప్రభాకర్ రెడ్డి, గుత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ బిందు వరలక్ష్మి, మార్కెట్ యార్డు చైర్మన్ సూర్యప్రతాప్, 21 వ వార్డు కౌన్సిలర్ వాల్మీకి శివప్రసాద్, డిఆర్ఓ ఏ.మలోల, యాదవ్ కార్పొరేషన్ డైరక్టర్ మస్తాన్ యాదవ్, జిల్లా టూరిజం అధికారి జయకుమార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.*

- *ఈ సందర్భంగా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన గుత్తి కోట ఉత్సవాలు 2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 50 లక్షల రూపాయల నిధులను కేటాయించిందని, ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో పర్యాటక స్థలంగా గుత్తి కోటను అభివృద్ధి చేస్తామన్నారు. గుత్తి కోట సుమారు 1300 సం.ల చరిత్ర కలిగినదని అన్నారు. గుత్తి కోట అభివృద్ధి, సంరక్షణకు కట్టుబడి ఉన్నామని, కలెక్టర్, ఎంపీ తమ పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని, ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయం, గుత్తి కోట మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో గర్వకారణం అని తెలిపారు. ఈ ఆహ్లాదకర సాయంత్రం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. కర్ణాటక హంపీ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో అలా గుత్తి కోట ఉత్సవాలు జరిగేలా చూస్తామన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాబోయే రోజుల్లో టూరిజం స్థలంగా అభివృద్ధి చేస్తామన్నారు. గుత్తి కోటకు 4 కోట్లతో బిటి రోడ్డు వేయిస్తామని సీఎం తెలిపారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అందరూ సహాయ సహకారాలు అందించాలన్నారు.*

- *ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ...గుత్తి కోట విశిష్టతను, సంప్రదాయాలను, వారసత్వంను భావితరాలకు తెలియజేయాలన్నారు. గుత్తి చరిత్రలో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తి కోటను విజయనగర, మరాఠా వీరులు, బ్రిటిష్ వారు, తదితరులు పరిపాలన చేశారన్నారు. గుత్తి కోటను సంరక్షించాలన్నారు. భవిష్యత్తులో ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించాలన్నారు. గుత్తి కోట గురించి ప్రతి విద్యార్థికి పాఠంలా తెలపాలన్నారు. పార్లమెంట్ లో కూడా మాట్లాడి 60 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేయాలని కోరామన్నారు. సీఎం టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గుత్తి కోట వెనుక బాగాన ఒక మార్గాన్ని నిర్మించేలా చూస్తున్నామన్నారు.*

- *ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ గొప్ప చరిత్ర గలిగిన గుత్తి కోట అని, విజయనగర సామ్రాజ్యం వారు పాలించిన ప్రాంతం అని తెలిపారు. లేపాక్షి ఉత్సవాలు, విజయవాడలో ఆవకాయ కార్యక్రమం వంటి కార్యక్రమాలు ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం గత కొన్ని రోజుల నుండి నిమగ్నమై గొప్పగా నిర్వహించడానికి ఘనంగా నిర్వహణకు కృషి చేస్తున్నారన్నారు. గుత్తి కోట ఉత్సవాలు 2026 కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా ఈనెల 14 మరియు 15 తేదీలలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.*

- *ఈ సందర్భంగా జెసి సి.విష్ణు చరణ్ మాట్లాడుతూ గుత్తి కోట ఎంతో ప్రాచుర్యం, ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం అని, సదరు గుత్తి కోట ఉత్సవాలు 2026 కార్యక్రమాలు నేడు మనం ఎంతో ఘనంగా ప్రారంభించుకున్నామనన్నారు. పలు కార్యక్రమాలు రేపు కూడా నిర్వహణ ఉంటుందని, ఉదయం హెరిటేజ్ వాక్ పెద్ద ఎత్తున ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.*

- *రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వెంకటశివుడు యాదవ్ మాట్లాడుతూ గుత్తి కోట ఉత్సవాలు సీఎంని ఒప్పించి నిధులను తీసుకొచ్చి నిర్వహించడం పట్ల ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తి కోటను మరింత అభివృద్ధి చేయాలన్నారు. ముందుగా జిల్లా రెవెన్యూ అధికారి ఏ.మలోల 'భలే మంచి రోజు.. పసందైన రోజు' అంటూ పాట పాడి ఉత్సహపరిచారు.*

- *గుత్తి కోట ఉత్సవాల్లో భాగంగా వ్యవసాయ శాఖ ఉద్యాన, డ్వామా, డిఆర్డీఎ, వైద్య ఆరోగ్య శాఖ, చేనేత, ఏపీఎంఐపీ, దేవాదాయ, పట్టు పరిశ్రమ, ఐసిడిఎస్, రూట్ సెట్, మనమిత్ర, మెప్మా, అగ్నిమాపక విపత్తు, టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ తాడిపత్రి, తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.*

- *ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్, తదితరులు ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్, జెసి, తదితరులను ఎమ్మెల్యే, ఎంపీలు సన్మానించారు.*

- *ఇందులో భాగంగా లాస్య కూచిపూడి కళాక్షేత్రం, గురు టివి.గంగాధరం వారి గణేష్ వందనం, లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి అమరావతి థీమ్ సాంగ్, అనంతపురం ట్రిల్లిస్ స్కూల్ వారి కోలాటం, లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి శివతాండవం, టూరిజం ఏవి, మెగా మ్యూజికల్ ఈవెంట్ - లైవ్ ఆర్కెస్ట్రా - కొప్పుల ప్రవీణ్, సాహితీ అడప & స్థానిక కళాకారులు, తదితర కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.*

- *ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీవో ఏబివిఎస్బి.శ్రీనివాస్, గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, డిఎల్డిఓ విజయలక్ష్మి, ఐ.అండ్.పీఆర్ డిఐపిఆర్ఓ బాలకొండయ్య, డిఆర్డీఏ పిడి శైలజ, డ్వామా పిడి సలీమ్ భాష, జిల్లా వ్యవసాయ అధికారి రవి, జడ్పి సిఈఓ శివశంకర్, జిల్లా హార్టికల్చర్ అధికారి ఉమాదేవి, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, డిఎస్డిఓ మంజుల, ఆర్కియాలజీ ఎడి స్వామినాయక్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు హరికుమార్, పుణ్యవతి, ఉషారాణి, రమాదేవి, ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

0
0 views

Comment