పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 అమలు: జిల్లా ఎస్పీ
జర్నలిస్ట్: ఆకుల గణేష్
భూపాలపల్లి జిల్లాలో మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదవ తరగతి (SSC) వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపిన వివరాల ప్రకారం, పరీక్షా కేంద్రాల వద్ద భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS–2023) సెక్షన్ 163 అమల్లో ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం, జిల్లాలోని 21 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 200 మీటర్ల పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించబడింది.