తాడ్వాయి: ఆస్పత్రిలో ఉరివేసుకొని ఆత్మహత్య
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా తాడ్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కాటాపూర్ గ్రామానికి చెందిన ముకుందం (35) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దూరంగా ఉండటంతో మద్యానికి బానిసైన ముకుందం, మద్యం మత్తులో కిందపడటంతో బంధువులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.