ఇమామ్‌లు, మౌజన్‌లకు రంజాన్ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో, విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పంపిణీ చేశారు.
శనివారం నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్‌లో ఉన్న విపిఆర్ గారి నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. నెల్లూరు సిటీ మరియు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వివిధ మసీదుల్లో సేవలు అందిస్తున్న ఇమామ్‌లు మరియు మౌజన్‌లకు ఈ రంజాన్ తోఫా కిట్లు అందజేశారు.
పార్లమెంట్ సమావేశాల నిమిత్తం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో, ఆయన తరఫున ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ముస్లిం మత పెద్దలకు గౌరవపూర్వకంగా ఈ కానుకలు అందించారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆమె, పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ముస్లిం మత పెద్దలను గౌరవిస్తూ ఈ కానుకలు అందించినందుకు ఇమామ్‌లు, మౌజన్‌లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరం మరియు రూరల్ నియోజకవర్గాల పరిధిలోని వివిధ మసీదుల ప్రతినిధులు పాల్గొన్నారు.