థర్డ్ పార్టీ అప్లికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చి 14 :-
తెలియని అప్లికేషన్లలకు అన్ని అనుమతులను ఇవ్వరాదు.
సైబర్ నేరాలకు ఆతిథ్యమవుతున్న థర్డ్ పార్టీ అప్లికేషన్లు.
డాటా చోరీ, బ్లాక్మెయిలింగ్, మొబైల్ హ్యాకింగ్, సోషల్ మీడియా హాకింగ్ కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు.
సైబర్ నేరాలకు వెంటనే 1930కు సంప్రదించాలి.
ఈవారం జిల్లాలో 14 ఫిర్యాదులు నమోదు.
జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాల నిర్వహణ.
ఏఐ వీడియో మెసేజెస్,సోషల్ మీడియా ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ ఫ్రాడ్, ఫేక్ కాల్స్, బ్లాక్మెయిలింగ్, డిజిటల్ అరెస్ట్ లాంటి నూతన సైబర్ నేరాలు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో "ఖాకీ కిడ్స్" ద్వారా అవగాహన కార్యక్రమాలు.
భారతదేశంలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మితిమీరి అమాయకులను మోసం చేస్తున్న సందర్భంలో ప్రజలు పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. అప్రమత్తతోనే, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయగలమని జిల్లాలోని సైబర్ బృందాలచే ప్రతి పోలీస్ స్టేషన్ల వారిగా నూతనంగా ఏర్పాటు చేయబడిన "ఖాకి కిడ్స్" అనే కార్యక్రమంలో ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసగిస్తున్న తీరు ప్రస్తుత సమాజంలో ప్రజలు మోసపోతున్న సందర్భాలపై వివరణను అందించారు. సైబర్ నేరానికి గురైన వెంటనే 1930కు సంప్రదించాలని, లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు తమ ఫిర్యాదులను నమోదు చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని, గంటలోపు ఫిర్యాదు చేసిన వారి నగదు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సమాజంలో ముఖ్యంగా థర్డ్ పార్టీ అప్లికేషన్లను వినియోగిస్తూ మొబైల్ ఫోన్లో వాటికి పూర్తిగా అనుమతులను ఇవ్వడం వల్ల మొబైల్ ఫోన్ డాటా అనేది చోరీకి గురవుతుందని, దానివల్ల సామాన్య ప్రజల వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లి బ్లాక్ మెయిల్ కి పాల్పడే అవకాశం ఉన్నందున థర్డ్ పార్టీ అప్లికేషన్లు వినియోగాన్ని నిరోధించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వెబ్సైట్లను అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోకుండా ఉండాలని తెలిపారు. ఈ అప్లికేషన్లలో ముఖ్యంగా లోన్ ఆప్స్, ఏపీకె ఫైల్స్ ఉంటాయని తెలిపారు. అదేవిధంగా సోషల్ మీడియా నందు జాబ్ ఫ్రాడ్, వర్క్ ఫ్రం హోం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బిజినెస్ ఫ్రాడ్, ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ లతో సందేశాలతో కూడిన ఫ్రాడ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, లాంటివి నూతన సమాజంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న నేరాలు వీటిని వల్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని అత్యాశ చూపి మోసగాళ్లు అమాయకులను, యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేస్తుంటారని తెలిపారు. సమాజంలో అధికారుల పేరుతో మోసం చేసే ప్రయత్నం, అధికారి పేరుతో డబ్బులు పంపాలనే ప్రయత్నం సైబర్ నేరగాళ్లు చేస్తుంటారని బాధితులు ఎలాంటి వాటిని నమ్మకుండా నిర్భయంగా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని తెలిపారు.
జిల్లాలో నమోదైన పలు సైబర్ క్రైమ్ వివరాలు
🔹 ఆదిలాబాద్ పట్టణంలోని ఒక బాధితుడి మై ఫినో బ్యాంక్ ఆప్ ద్వారా 5500 థర్డ్ పార్టీ అప్లికేషన్లను వినియోగించడం వల్ల పోగొట్టుకోవడం జరిగింది.
🔹 ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఒక మహిళకు ఇంస్టాగ్రామ్ నందు పార్ట్ టైం జాబ్ అంటూ చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని మహిళ వద్దనుండి 17300 రూపాయలను మోసం చేయడం జరిగింది.
🔹 నాగ్నూర్ కు చెందిన మహిళకు ఫోన్ ద్వారా మాయమాటలు చెప్పిన కేటుగాళ్లు మహిళ అకౌంట్ నుండి దాదాపు 70 వేల రూపాయలను మోసం చేయడం జరిగింది.
🔹 నేరడిగొండకు సంబంధించిన వ్యక్తికి ఎస్బిఐ నుండి ఫోన్ చేస్తున్నా మీ ట్రాన్సాక్షన్ లేట్ అయింది మీ అకౌంట్ కు సంబంధించిన వివరాలు తెలియజేయగలరు అంటూ నమ్మించగా బాధితుడు వివరాలు చెప్పడంతో 50 వేల రూపాయలను మోసపోవడం జరిగింది.
🔹 నేరేడిగొండ మహిళ స్క్రీన్ షేరింగ్ ద్వారా మోసగాళ్ల చేతిలో మోసపోయి దాదాపు లక్ష రూపాయలు మోసపోవడం