మంత్రి నారాయణ ఆదేశాలతో 54వ డివిజన్‌లో కో ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ పర్యటన
నెల్లూరు నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ షేక్ జమీర్ 54వ డివిజన్ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రతి ఇంటికీ వెళ్లి మంత్రి నారాయణ నాయకత్వంలో 54వ డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.
కాలనీలో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి వెంటనే శానిటేషన్ సిబ్బందితో రోడ్లపై ఉన్న చెత్తను తొలగించడంతో పాటు కాలువల్లో పేరుకుపోయిన పూడికలను కూడా శుభ్రం చేయించారు. స్థానికంగా ఉన్న సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో 54వ డివిజన్ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు హసిబ్, మహాభాష, మహాశక్తి జరీన, సచివాలయ శానిటేషన్ సెక్రటరీ లీలా కుమారి, శానిటేషన్ మేస్త్రీ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.