పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలన
ప్రశాంతంగా మొదలైన పదవ తరగతి వార్షిక పరీక్షలు
పత్రికా ప్రకటన
ఆదిలాబాద్ జిల్లా,
మార్చ్ 14 :-
జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు.
పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ అమలు
పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఇంటర్నెట్ సెంటర్లు జిరాక్స్ సెంటర్లు మూసివేత.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన నేపథ్యంలో పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పరిశీలించారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉన్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రజలు గుమికుడి ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, పరీక్ష పూర్తి అయ్యేంతవరకు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
జిల్లాలోని 52 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వెలుపలి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ నిర్వహిస్తూ ఉండడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి ఎలక్ట్రానిక్ వస్తువులు, వాచ్లు, ఇయర్ ఫోన్స్ లాంటి వాటికి అనుమతులు లేవని, లోనికి వెళ్లే ముందు సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించి అనుమతి ఇస్తారని తెలిపారు. పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ పట్టణ సీఐ బి సునీల్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.