logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చల్మెడ రిషిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వయం పరిపాలన దినోత్సవం..

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల పరిధిలో గల రిషిక్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలొ శుక్రవారం నాడు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 4,5 వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతులలో విద్యా బోధన చేశారు. వీరిలో ప్రధానోపాధ్యాయులుగా గ్రీష్మిత ఎంఈఓ గా జాగృతి, డీఈవోగా నిశ్వంత్, అభినంద్ . మహిళాఉపాధ్యాయులుగా కీర్తి ప్రియ, సాకృతి, లోహిత, సాన్విక,లిప్సిక, అవంతిక, అనన్య, ప్రదీప్తి, నిత్యశ్రీ, మను శ్రీ, లికిత, ప్రత్యూష, సాత్విక, శ్రీనిధి. ఉపాధ్యాయులుగా జగదీశ్వర్, విపుల్ సాయి గౌడ్, అభిరామ్, హేమంత్, దీక్షిత్, మధు, విష్ణువర్ధన్, అశ్వసేనా చారి, రుత్విక్, శ్రీయాన్, శేషంక్, నమిత్ రెడ్డి, తరుణ్, అవనీష్, దేవాన్ష్, అఖిలేష్, సద్విక్, విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్వామి, భాస్కర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు స్వప్న, సంధ్య, భాగ్యలక్ష్మి, లావణ్య, స్వప్న, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

9
747 views

Comment