logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*పదవ తరగతి పరీక్షలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి*

*పత్రికా ప్రకటన*
అదిలాబాద్ జిల్లా,
మార్చ్ 13 :-


*పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ (144)అమలు*

*పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు మూసివేత*

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్*

జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

జిల్లాలో నిర్వహించబడుతున్న పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా చేరకుండా ఉండేందుకు జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రం పరిసరాలలో 200 మీటర్ల దూరం వరకు ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించడం జరిగిందన్నారు. పరీక్షకు సంభందించి ఎలాంటి అసత్య ప్రచారాలు చేసిన నమ్మరాదని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులపై జిల్లా పోలీసు కేంద్రం నుండి ప్రత్యేక నిఘా ఉంటుందని హెచ్చరించారు.

4
88 views

Comment