logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది*....

*రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది*అన్నదాత సుఖీభవ మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు *రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది*కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు తెలిపారు. అన్నదాత సుఖీభవ మూడో విడత పంపిణీలో భాగంగా అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని, రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పూల నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూల నాగరాజు.మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని రైతుకు ఏడాదికి 20వేల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ మూడో విడత డబ్బులు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయన్నారు. చివరి విడతగా రైతుల ఖాతాల్లో 6వేల రూపాయలు జమ చేసిందన్నారు. ఈ ఒక్క పదమే కాకుండా రైతులకు ఎరువులును సబ్సిడీ ధరపై ఎలాంటి అనంతరం లేకుండా చేస్తున్నామన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎరువుల కొరత లేకుండా చేశామన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి లోనైన ప్రాజెక్టులు ప్రభుత్వం నేలకోట్లు ఖర్చు చేసి ప్రతి ఎకరాకు నేను అందిస్తుందన్నారు. ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం అనుబంధం రంగాలకు 53, 752 కోట్లు కేటాయించి కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు. జగన్ రెడ్డి మొదటి నుంచి రైతాంగాన్ని మోసం చేశాడన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తూ రాష్ట్రంలో రైతులకు శాశ్వత సాగునీటి సమస్యల పరిష్కారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారన్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1,6,329 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయన్నారు. నియోజవర్గంలో 54,338 రైతులకు అన్నదాత సుఖీభవ కింద 21 కోట్ల 74 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ పథకం ద్వారా 9 కోట్ల 79 లక్షల రూపాయలు రైతులకు లబ్ధి చేకూరిందని పూల నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగనమల మండల టిడిపి కన్వీనర్ లక్ష్మీనారాయణ, మాజీ గ్రంథాల చైర్మన్ గౌస్ మోద్దిన్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, రైతులు, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
0 views

Comment