ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న సీఎం.....నిబంధనల అమలులో.....
*కలెక్టర్ల కాన్ఫరెన్సులో శాంతిభద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం.*
*ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్న సీఎం.....నిబంధనల అమలులో కఠినంగా ఉండాలని సూచన*
*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...*
రోడ్డు ప్రమాదా లు తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టండి.ప్రతీ ప్రాణమూ విలువైనదే. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా చర్యలు తీసుకోండి.ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి... సమన్వయంతో పని చేయాలి.శ్రీకాకుళం లాంటి కొన్ని జిల్లాల్లో చేపడుతున్న ఉత్తమ విధానాలను ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించాలి.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగానే వ్యవహరించాలి...ఎవరైనా సరే ఉపేక్షించకండి.బ్రీత్ అనలైజర్లు, స్పీడ్ గన్లు కొనుగోలుకు రూ.44 కోట్లు విడుదల చేస్తాం
జాతీయ సగటుతో పోలిస్తే రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ మరింత మెరుగు పడాలి.సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్ లాంటి అంశాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి.అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖ, తదితర జిల్లాల్లోని బ్లాక్ స్పాట్లపై దృష్టి పెట్టాలి.బ్లాక్ స్పాట్స్ పై ఫోకస్ పెట్టండి ప్రమాదాల నివారణ లో రిజల్ట్ కనిపించాలి.జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ప్రతీ బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి.మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు భయం ఉండేలా కఠినంగా చర్యలు.మహిళపై నేరాల్లో జీరో టాలరెన్సు...అప్పుడే మార్పు సాధ్యంమదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు కఠినంగా ఉండండి.మహిళలపై గృహ హింస కేసుల్లోనూ తగిన చర్యలు తీసుకోండి.