logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంది..

*రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తేదీ 12.03.2026 గురువారం రాష్ట్ర సచివాలయంలో జరుగుచున్న 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు ప్రారంభంలో పెట్టుబడుల ప్రతిపాదనలపై రాష్ట్ర పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….*

#జూన్ 2024 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంది. ఈ కాలంలో పార్టర్నర్ షిప్ సమ్మిట్ PS-2025 MoUs మరియు SIPB ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా సుమారు ₹20,35,261 కోట్ల పెట్టుబడులకు సంబందించి మొత్తం 771 కంపెనీలు ముందుకొచ్చాయి. వీటి ద్వారా దాదాపు 22,43,931 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఇందులో PS-2025 MoUs ద్వారా 538 కంపెనీలు ₹11,37,881 కోట్ల పెట్టుబడితో 13,95,210 ఉద్యోగాలు, అలాగే SIPB ఆమోదించిన ప్రాజెక్టుల ద్వారా 233 కంపెనీలు ₹8,97,380 కోట్ల పెట్టుబడితో 8,48,721 ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
#వీటిలో ఇప్పటికే గ్రౌండింగ్ కు సిద్దంగా ఉన్న అన్ని ప్రాజక్టులను ఈ ఏడాది. జూన్ కల్లా గ్రౌండ్ అయ్యేలా చూడాలి. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి ప్రాజెక్టులను వేగంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ముఖ్యంగా SIPB ఆమోదించిన ప్రాజెక్టులు మరియు PS-2025 MoUs ప్రాజెక్టుల గ్రౌండింగ్‌పై అన్ని జిల్లాలు దృష్టి పెట్టాలి. ఇందుకు అవసరమైన భూమి గుర్తింపు, ఫీల్డ్ విజిట్లు నిర్వహించడం, ముందస్తు భూమి సేకరణ మరియు మౌలిక వసతులు (రహదారి, నీరు, విద్యుత్ వంటి) సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
#ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మంచి ఫలితాలు సాధించారు. ఉదాహరణకు అనకాపల్లి జిల్లాలో AMNSI ప్రాజెక్ట్ మరియు గూగుల్ భూమి కేటాయింపు, విశాఖపట్నం జిల్లాలో గూగుల్ ప్రాజెక్ట్, నెల్లూరు జిల్లాలో పలు పరిశ్రమల ప్రాజెక్టులు, తిరుపతి జిల్లా శ్రీ సిటీలో LG ప్రాజెక్ట్, అలాగే కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్రాజెక్ట్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల అమలులో పురోగతి సాధించబడింది. అదనంగా బలమైన PMU వ్యవస్థ ఏర్పాటు చేసి, లైన్ డిపార్ట్మెంట్లు మరియు ప్రాజెక్ట్ ప్రతినిధులతో నిరంతర వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ద్వారా ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయాలి.
#జిల్లా కలెక్టర్లు SIPB ఆమోదించిన ప్రాజెక్టులను ప్రతి వారం ప్లాంట్ హెడ్‌లు మరియు మేనేజ్‌మెంట్‌తో సమీక్షించాలి, అలాగే భూమి అవసరాలను త్వరగా పూర్తి చేయడం కోసం MoU పెట్టుబడిదారులతో సమన్వయం చేయాలి. ప్రతి ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షించడానికి మండల స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడం, పెద్ద ప్రాజెక్టుల విషయంలో జాయింట్ కలెక్టర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించడం అవసరం.
#విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి వంటి జిల్లాల్లో ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నందున మున్సిపల్ కమిషనర్లు వంటి ఇతర అధికారులను కూడా గ్రౌండింగ్ పర్యవేక్షణలో వినియోగించాలి. అదనంగా ప్రతి 15 రోజులకు ఒకసారి సంబంధిత శాఖల సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలి. ప్రాజెక్టుల కోసం సైట్ హ్యాండోవర్‌ను సమగ్రంగా నిర్వహించి, భూమి సంబంధిత సమస్యలతో పాటు సైట్ వెలుపల ఉన్న యాక్సెస్ రోడ్లు, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను కూడా పరిష్కరించడం ద్వారా ప్రాజెక్టుల అమలు వేగంగా జరిగేలా చూడాలి.
#తదుపరి పిపిపి ప్రాజక్టులను వేగవంతంగా గ్రౌండ్ చేసే విషయంలో జిల్లా కలెక్టర్లు అమలు పర్చాల్సిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా కలెక్టర్లకు వివరించారు.

0
88 views

Comment