logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సీనప్స్ ఒలంపియాడ్ పరీక్షల్లో నారాయణ పాఠశాల విద్యార్థిని ఇండియా ఫస్ట్ ర్యాంకు.

నంద్యాల (AIMA MEDIA ): ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన సీనప్స్ (కౌన్సిల్ ఆఫ్ నర్చారింగ్ అకాడమిక్ పొటెన్షియల్ ఇన్ స్టూడెంట్స్ )ఒలంపియాడ్ పరీక్షల్లో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాయిబాబా నగర్ బ్రాంచ్ విద్యార్థిని అయిన జి.లహరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించి లాప్టాప్ మరియు గోల్డ్ మెడల్ పొందిన సందర్భంగా బ్రాంచ్ ప్రిన్సిపాల్ దివ్య ఆధ్వర్యంలో అభినందన సభ జరిగినది.ఈ సభకు ముఖ్య అతిథులుగా ఆర్ అండ్ డి హెడ్ నరేష్ , రూప్ కోష్ , ఏ.జి.ఎం ప్రశాంత్,ఆర్ఐ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, జెడ్ సి శివ, నాగలక్ష్మి, తస్లీమ్ బ్రాంచ్ ప్రిన్సిపల్స్ అంజనీ దేవి,రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ బ్రాంచెస్ స్థాపించిన రెండో సంవత్సరంలోనే ఆల్ ఇండియా స్థాయిలో ఐదు ర్యాంకులు సాధించడం హర్షనీయమని అన్నారు. ప్రిన్సిపల్ దివ్య తేజ మాట్లాడుతూ ఐఎస్ఈవో విభాగంలో 56వ ర్యాంకు సాధించిన శ్రీవల్లి 87వ ర్యాంక్ సాధించిన ఎస్ లాలిత్య ఐఎస్ఎస్ఓ విభాగంలో 41వ ర్యాంకు సాధించిన తన్విక రెడ్డి 100 లంక సాధించిన తన్వితలకు మెడల్స్ అందజేసి సత్కరించారు. మెడల్స్ సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఎందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఏ.జి.ఎం ప్రశాంత్ మాట్లాడుతూ ఈ విధంగా కేవలం అకాడమిక్స్ లోనే కాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నందు అన్నింటిలో ముందుకు వెళ్తున్న మా నారాయణ విద్యార్థులకు మా అభినందనలు అని అభినందనలు తెలియజేశారు. ఇటువంటి విజయాలు సాధించడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న నారాయణ యాజమాన్యానికి వైస్ ప్రిన్సిపాల్ విజయదుర్గ ఏవో హరి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

0
455 views

Comment