ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం.
నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం పక్కన సలీం నగర్ వెల్లే దారిలో నాలుగు నెలలుగా ఒక్క రూపాయికే ప్లేట్ పుల్కా,కర్రీ, పప్పు, ఒక్క రూపాయికే కలర్ రైస్,కర్రీ, 1రూపాయికే జొన్న రొట్టె, పప్పు నిరంతరాయంగా కొనసాగుతా ఉన్న నేపథ్యంలో ఈరోజు వినూత్నంగా కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం ప్రారంభించారు. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్. ఎంతో మంది ప్రజలు నంద్యాల జిల్లా లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలకు తమపని కొరకు ఎంతోమంది వస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారందరికీ కమ్మని రుచికరమైనటువంటి భోజనం అతి తక్కువ ధరలో అందించాలని అటువంటి సదుద్దేశంతో ఇప్పటికే పుల్కాలు,కలర్ రైస్ జొన్న రొట్టెలు అందిస్తున్న విషయం నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈరోజు నుండి కేవలం ఒక్క రూపాయికే రుచికరమైన భోజనం అందించాలని సంకల్పంతో ఒక్క రూపాయికే భోజనం ప్రారంభించారు. ఈ విషయాన్ని నంద్యాల నియోజకవర్గంలోకి తెలియజేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్ని సజావుగా ముందుకు వెళ్లడానికి నంద్యాల నియోజకవర్గ పెద్దలు,మా శ్రేయోభిలాషులు,స్నేహితులు,ప్రజలు అందరూ మాకు అన్ని వివరాలు మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.