మావల ఎస్ హెచ్ ఓ గా శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్
.
. శిక్షణలో భాగంగా మూడు నెలల పాటు మావల ఎస్ హెచ్ ఓ గా బాధ్యతల నిర్వహణ
పూల మొక్క అందజేసి స్వాగతం పలికిన మావల సీఐ కర్రె స్వామి
ఐపీఎస్ శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు విచ్చేసిన శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్ మూడు నెలల పాటు మావుల ఎస్హెచ్ఓ గా విధులు నిర్వహించనున్నారు. మావల మండల పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించడం, పోలీసు విధులను చేపట్టడం, ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడం లాంటి చర్యలను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మావల సీఐ కర్రె స్వామి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.