logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బీసీ సమస్యలపై పోరాటంతో ప్రసిద్ధి చెందిన కవితకు జాతీయ ఓబీసీ అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు

పార్లమెంటులో బీసీ (ఇతర వర్గాలు) సమస్యలపై సుప్రీం షోలే, కనుమౌళి వంటి మహిళా దిగ్గజాలతో కలిసి గలమెత్తిన తెలంగాణ తెలుగు బిడ్డ కవితకు జాతీయ ఓబీసీ అధ్యక్షుడు (జ్యోతిరావు పూలే)పోతల ప్రసాద్ నాయుడు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ హక్కుల కోసం మహిళా ఎంపీలను కలుపుకుని పోరాటాన్ని నడిపిన ఆమెకు ప్రత్యేక గౌరవంగా, ఈరోజు ఆమె నివాసంలో స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.కవిత జన్మదిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోతల ప్రసాద్ మాట్లాడుతూ, "కవిత రాజకీయ రంగంలో ఇప్పటికే అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది. ఆమె బీసీ సమస్యలపై చేసిన పోరాటం దేశవ్యాప్తంగా మైలురాయి. రాబోయే రోజుల్లో రాజకీయంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, అత్యున్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.కవిత మాట్లాడుతూ, "బీసీల హక్కుల కోసం మా పోరాటం ఇక్కడితో ఆగదు. పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలోనూ కొనసాగుతుంది. జాతీయ ఓబీసీ అధ్యక్షుడి ఈ గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సోదరీ సోదరుల అభివృద్ధి కోసం మరింత శక్తివంతంగా పనిచేస్తాము" అని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మహిళా విభాగ నాయకులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొని, బీసీల భవిష్యత్ కోసం ఐక్యత ప్రదర్శించారు.ఈ కార్యక్రమం బీసీ సమాజంలో ఉత్సాహాన్ని నింపింది. కవిత పోరాటం ద్వారా బీసీలకు న్యాయం లభించాలని, ఆమె రాజకీయ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని స్థానిక నాయకులు కోరారు.

9
677 views

Comment