logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అన్నదాత సుఖీభవ మూడవ విడత పంపిణీ కార్యక్రమం: ఏఓ పవన్ కుమార్.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అన్నదాత సుఖీభవ మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొంటారని మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ మూడవ విడత పీఎం కిసాన్ 22 విడత పంపిణీ కార్యక్రమం స్థానిక ఒకటవ గ్రామ సచివాలయం వద్ద శ్రీ లక్ష్మీ జనార్ధన దేవాలయం నందు నిర్వహిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొని రైతులకు మెగా చెక్కు పంపిణీ చేస్తారని, ఈ పథకం ద్వారా మండల వ్యాప్తంగా 7734 రైతు కుటుంబాలు నాలుగు కోట్ల యాబై ఏడు లక్షల రూపాయలు లబ్ధి పొందుతారని ఏఓ తెలిపారు.ఈ విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.4 వేల చొప్పున కేంద్ర వాటా రూ.2వేలతో కలిపి మొత్తం రూ.6000 ప్రతి రైతు కుటుంబానికి జమ కానున్నది. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అనగా కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇచ్చిందన్నారు. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.మరోవైపు విశిష్ట సంఖ్య కలిగి ఆధార్ బ్యాంకు ఖాతాతో ఎన్ పిసీఐ లింక్ చేసుకున్న రైతులకు మాత్రమే లబ్ధి పొందుతారని, కావున రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని,తమ బ్యాంకు ఖాతాలను ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని వెల్లడించారు.ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో ఉన్నదని రైతులు అన్నదాత సుభీభవకు సంబంధించి ఎటువంటి సమస్యలున్న స్థానిక రైతు సేవా కేంద్రంలో అర్జీ ద్వారా తెలపాలని రైతులను ఏఓ కోరారు.

1
119 views

Comment